2023 చివరి నాటికి జమ్మూకశ్మీర్ లిథియం నిక్షేపాల వేలం

  • వేలానికి సంబంధించి సంప్రదింపులు పూర్తయినట్లు వెల్లడి
  • వేలం ప్రక్రియపై పార్లమెంటులో చర్చ
  • జమ్మూ కశ్మీర్ లో 59 లక్షల టన్నుల లిథియం రిజర్వ్‌లు
జమ్మూ కశ్మీర్ లో వెలుగు చూసిన లిథియం నిక్షేపాల వేలానికి రంగం సిద్ధమవుతోంది. 2023 చివరి నాటికి వేలం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు గనుల శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ తెలిపారు. భాగస్వామ్య పక్షాలతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్లు వెల్లడించారు. డిసెంబర్ నాటికి వేలం ప్రక్రియ ముగిసే అవకాశముందన్నారు. ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరగనుందని తెలిపారు. జమ్మూ కశ్మీర్ లోని రియాసి జిల్లాలో సలాల్ హైమాన ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో భారీ లిథియం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. మొత్తం 59 లక్షల టన్నుల రిజర్వ్‌లు వెలుగు చూశాయి.


More Telugu News