7,800 ఉద్యోగాలను ఏఐతో రీప్లేస్ చేయనున్న ఐబీఎం

  • రాబోయే ఐదేళ్లలో 30 శాతం మంది ఉద్యోగాలు కోల్పోతారన్న ఐబీఎం సీఈవో
  • బ్యాక్ ఆఫీస్ కు చెందిన కొన్ని విధులను ఏఐతో రీప్లేస్ చేస్తామని వెల్లడి
  • మరోవైపు ఏఐపై ఇప్పటికే వ్యక్తమవుతున్న ఆందోళన
చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్ ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో ఈ కృతిమ మేథ ఊహించని మార్పులకు కారణమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఐదేళ్లలో బ్యాక్ ఆఫీస్ కు చెందిన కొన్ని విధులను ఏఐతో రీప్లేస్ చేస్తామని చెప్పారు. మానవ వనరులను ఏఐతో రీప్లేస్ చేస్తామని వెల్లడించారు. ఏఐ, ఆటోమేషన్ కారణంగా రాబోయే ఐదేళ్లలో 30 శాతం మంది ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోతారని చెప్పారు. ఈ సంఖ్య 7,800 వరకు ఉంటుందని అన్నారు. 

మరోవైపు ఏఐపై పలువురు టెక్నాలజీ ఎంటర్ ప్రెన్యూర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐకి నియంత్రణ యంత్రాంగం ఉండాలని, దీనిపై ప్రభుత్వాల జోక్యం అవసరమని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. టెక్నాలజీ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు నియంత్రణ అవసరమని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు.



More Telugu News