టీఎస్ ఎంసెట్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం

  • ఎంసెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 3,19,947
  • మే 10 నుంచి 14వ తేదీ వరకు పరీక్షలు
  • ఈ ఏడాది అదనంగా 50 వేల దరఖాస్తులు
ఈ నెల 10 నుంచి 14 వరకు తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ (ఫార్మసీ, వెటర్నరీ)... 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరగబోతున్నాయి. ఎంసెట్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పక్కాగా చేసినట్టు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. మొత్తం 3,19,947 మంది ఎంసెట్ కు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఈ ఏడాది అదనంగా మరో 50 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో 137 కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. విద్యార్థులు నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని... ఆలస్యమైతే అనుమతించేది లేదని హెచ్చరించారు.


More Telugu News