నువ్వు నా కాలి దుమ్ముతో సమానం.. ఆఫ్ఘన్ బౌలర్ పై కోహ్లీ ఫైర్.. ఇదిగో వీడియో!

  • నిన్న బెంగళూరు, లక్నో జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్
  • గౌతమ్ గంభీర్, నవీనుల్ హక్ తో కోహ్లీ గొడవ
  • ఇన్ స్టాలో పోస్ట్ పెట్టిన కోహ్లీ.. పరోక్షంగా నవీనుల్ హక్ కౌంటర్!
ఐపీఎల్ లో భాగంగా నిన్న బెంగళూరు, లక్నో జట్ల మధ్య జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్ హై ఓల్టేజ్ తో సాగింది. క్యాచ్ లు పట్టినప్పుడల్లా కోహ్లీ హావభావాలు, లక్నో బౌలర్ తో మాటల యుద్ధం, మ్యాచ్ తర్వాత లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్ తో వాగ్వాదం తదితర ఘటనలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. నిబంధనలను ఉల్లంఘించినందుకు గంభీర్, కోహ్లీలకు 100 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించారు. నవీనుల్ హక్ (ఆఫ్ఘన్ బౌలర్.. లక్నోకు ఆడుతున్నాడు.) మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పెట్టారు.

మ్యాచ్ సమయంలో నవీనుల్ హక్ బ్యాటింగ్ చేస్తుండగా.. కోహ్లీ వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. నవీనుల్ హక్ వైపు దూసుకెళ్లిన కోహ్లీ.. ‘నువ్వు నా కాలికి ఉన్న దుమ్ముతో సమానం’ అన్నట్లుగా వ్యవహరించాడు. అంపైర్లు, అమిత్ మిశ్రా కలగజేసుకోవడంతో ఏదో అనుకుంటూ వెళ్లిపోయాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ తీరుపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ అలా వ్యవహరించాల్సింది కాదని కామెంట్లు చేస్తున్నారు. సిగ్గు చేటు, అహంకారి అంటూ మరొకొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

మరోవైపు ఈ రోజు ఉదయం కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘మనం విన్నదంతా ఒక అభిప్రాయం మాత్రమే.. వాస్తవం కాదు. మనం చూసేదంతా ఒక దృక్కోణం మాత్రమే.. నిజం కాదు’’ అని రోమన్ చక్రవర్తి మార్కస్ ఆరేలియస్ ఆంటోనినస్ చెప్పిన మాటను ప్రస్తావించాడు.

మరోవైపు నవీనుల్ హక్ కూడా ఇన్ స్టాలో ఓ పోస్టు పెట్టాడు. ‘‘నువ్వు దేనికి అర్హుడివో దాన్నే పొందుతావు. అది అలానే ఉంటుంది. అలానే జరుగుతుంది’’ అని పేర్కొన్నాడు. కోహ్లీకి కౌంటర్ గానే ఇతడు ఈ పోస్టు పెట్టాడనే చర్చ జరుగుతోంది.



More Telugu News