తిరుమలకు వెళ్లే భక్తులు ముందు ఈ అమ్మవారిని దర్శించుకుంటే దర్శనం పరిపూర్ణం అవుతుంది: మంత్రి రోజా

  • తాతయ్య గుంట గంగమ్మతల్లిని దర్శించుకున్న రోజా
  • అమ్మవారి ఆశీస్సులు అందుకున్న మంత్రి
  • సీఎం జగన్ వల్ల అనేక దేవాలయాలు సందర్శించగలుగుతున్నానని వెల్లడి
ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, తిరుమలకు వెళ్లే భక్తులు ముందుగా తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకోవాలని సూచించారు. అమ్మవారి దర్శనం అనంతరం తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటే దర్శనం పరిపూర్ణం అవుతుందని వివరించారు. 

తాను తిరుపతిలో చదువుకునే రోజుల్లో గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుని వెళ్లేదాన్నని రోజా వెల్లడించారు. సీఎం జగన్ ఆశీస్సులతో పర్యాటక, క్రీడల, సాంస్కృతిక శాఖ మంత్రిగా అనేక దేవాలయాల్లో దేవతలను సందర్శించుకునే అవకాశం కలిగిందని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. 

తిరుపతి గ్రామ దేవతగా పేరుగాంచిన తాతయ్య గుంట గంగమ్మ తల్లికి మే 1 నుంచి 5వ తేదీ వరకు యంత్ర, విగ్రహ, శిఖర, కలశ స్థిర ప్రతిష్టాపన మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నారు.


More Telugu News