ఎక్కువ జీతాలిచ్చే దేశాల్లో తొలి స్థానంలో స్విట్జర్లాండ్.. మరి ఇండియా స్థానం?
- మన దేశంలో సగటున నెల జీతం రూ.46,861
- రూ.4,98,567 వేతనంతో తొలి స్థానంలో స్విస్
- 65వ స్థానంలో భారత్.. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిపోర్టులో వెల్లడి
ఉద్యోగులు, కార్మికుల సగటు జీతం విషయంలో భారతదేశం చాలా దేశాల కంటే వెనుకబడిందని ‘ది వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్’ సంస్థ రిపోర్టులో వెల్లడైంది. మన దేశంలో సగటున నెల జీతం రూ.46,861గా ఉందని తెలిపింది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల్లో నెలవారీ జీతాలకు సంబంధించిన గణాంకాలను వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సోమవారం విడుదల చేసింది.
లక్ష రూపాయల కంటే ఎక్కువ జీతం 23 దేశాల్లోని ఉద్యోగులు అందుకుంటున్నారు. ఎక్కువ జీతాలు అందుకుంటున్న దేశాల జాబితాలో.. రూ.50 వేల కంటే తక్కువ సగటు వేతనంతో భారత్ 65వ స్థానంలో ఉండటం గమనార్హం.
ఇక ఈ జాబితాలో అగ్రదేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా దేశాలు టాప్ 3లో లేవు. స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. అక్కడి ఉద్యోగులు సగటున రూ.4,98,567 వేతనం అందుకుంటున్నారు.
టాప్ టెన్ లో స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్, సింగపూర్, అమెరికా, ఐస్ ల్యాండ్, ఖతర్, డెన్మార్క్, యూఏఈ, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి. చైనాలో సగటు నెల వేతనం రూ.87,426గా ఉంది. ఇక భారత్ కంటే వెనుకబడిన దేశాల్లో టర్కీ, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండోనేషియా, కొలంబియా, బంగ్లాదేశ్, వెనెజులా, నైజీరియా, ఈజిప్ట్, పాకిస్థాన్ వంటివి ఉన్నాయి.