మామిడి గుజ్జుతో హ్యాండ్ బ్యాగ్ తయారీ.. సీఎల్ఆర్ఐ ఆవిష్కరణ
- తోలు మాదిరి మెటీరియల్ ను తయారు చేసిన సీఎల్ఆర్ఐ
- దీనిపై పేటెంట్ కు దరఖాస్తు
- ముంబైలోని ప్రైవేటు కంపెనీకి టెక్నాలజీ బదిలీ
మామిడి కాయలు, మామిడి పండ్లను ఇష్టపడని వారు ఉండరు. మామిడితో చేసే ఊరగాయ, తురుము పచ్చడి, పచ్చి పులుసు, పప్పు ఇవన్నీ రుచికరంగా ఉంటాయి. మామిడి పండ్లు అయితే ఎన్ని అయినా తినాలనిపిస్తుంది. అయితే మామిడి కీర్తి అంతటితోనే ఆగిపోలేదు. భవిష్యత్తులో మామిడితో చేసిన హ్యాండ్ బ్యాగులు, పాదరక్షలు, బెల్ట్ లు, వ్యాలెట్లు కూడా మన వంటిపైకి చేరొచ్చు. ఎందుకంటే మామిడి గుజ్జుతో తోలులాంటి పదార్థాన్ని చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎల్ఆర్ఐ) అభివృద్ధి చేసింది.
సింథటిక్ తోలుకు ఇది పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయం అవుతుందని భావిస్తున్నారు. నూతనంగా రూపొందించిన మెటీరియల్ లో 50 శాతం మామిడి గుజ్జు ఉంటుంది. కాకపోతే పాలీయురేథేన్ తో తయారు చేసిన తోలు కంటే మామిడితో చేసిన తోలు జీవిత కాలం తక్కువ. సీఎల్ఆర్ఐ శాస్త్రవేత్తలు దీనిపై పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు. ఈ టెక్నాలజీని ముంబైకి చెందిన స్టార్టప్ ఆమతి గ్రీన్ ప్రైవేటు లిమిటెడ్ కు బదిలీ చేశారు. సీఎల్ఆర్ఐ మామిడి తోలు పరిశోధనకు నిధులను సమకూర్చింది ఆమతి గ్రీన్ కావడం గమనార్హం.
మామిడి గుజ్జుని బయోపాలిమర్ తో కలిపి, ఆ తర్వాత పౌడర్ గా మార్చి షీట్ గా తయారు చేస్తారు. సర్ఫేస్ కోటింగ్ అనంతరం ఆ మెటీరియల్ తో బ్యాగులు, ల్యాప్ టాప్ కవర్లను తయారు చేస్తారు. వీటి మన్నికపై పరీక్షలు నిర్వహించారు. పాదరక్షలు సైతం తయారు చేసేందుకు వీలుగా ఈ మెటీరియల్ ను మరింత మెరుగుపరచడంపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. అయితే సహజ తోలుతో మరే మెటీరియల్ పోటీ పడలేదని వీరు ప్రకటించారు. మన దేశంలో మామిడి ఎక్కువగా సాగు అవుతుండడంతో దీన్ని పరిశోధనకు ఎంచుకున్నారు. మామిడి సాయంతో తోలు తయారు చేస్తున్న ఏకైక కంపెనీ ప్రస్తుతం నెదర్లాండ్ లోనే ఉంది.