పర్యాటకులకు గమనిక.. మళ్లీ ఆగిన పాపికొండల పర్యటన
- ఏపీలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు
- తుపాను హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు
- రెండు రోజులపాటు బోట్లను నిలిపివేస్తున్నట్టు ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారానికి మరోమారు బ్రేక్ పడింది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు వాతావరణ శాఖ తుపాను హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రెండు రోజులపాటు పాపికొండల విహార యాత్రను అధికారులు నిలిపివేశారు.
ఈ మేరకు రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే నిన్న ఉదయం ఆదేశాలు జారీ చేసినట్టు పోచవరం పర్యాటక కంట్రోల్ రూం పర్యవేక్షకుడు రాజేశ్ తెలిపారు. పాపికొండల పర్యటనకు వెళ్లే బోట్లను నిలిపివేసినట్టు పేర్కొన్నారు. ఇటీవల కూడా పలుమార్లు పోలవరం బోట్లను నిలిపివేశారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.