బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న రూ. 13 కోట్ల విలువైన పాము విషం స్వాధీనం
- భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఘటన
- స్మగ్లింగ్‌పై ఉప్పందుకున్న బీఎస్ఎఫ్ అధికారులు
- నిఘా పెంచి కాపుకాసిన సిబ్బంది
- అర్ధరాత్రి వేళ భారత్‌లోకి ప్రవేశించిన స్మగ్లర్లపై కాల్పులు
- పారిపోతూ పాము విషం నింపిన గాజు జార్‌ను జార విడిచిన స్మగ్లర్లు
బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా తరలిస్తున్న పాము విషాన్ని బీఎస్ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని పమన్‌పరా గ్రామంలో స్మగ్లర్లు పారిపోతూ పాము విషంతో నింపిన గాజు జార్‌ను జారవిడిచారు. బీఎస్ఎఫ్ సిబ్బంది దీనిని స్వాధీనం చేసుకున్నారు.
పాము విషం స్మగ్లింగ్‌పై ఉప్పందుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమై ఆ ప్రాంతంలో నిఘా పెంచారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటల సమయంలో ఇద్దరు స్మగ్లర్లు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు.
ఆ తర్వాత ఆ ప్రాంతంలో గాలించగా స్మగ్లర్లు జారవిడిచిన ఓ గాజు జార్ దొరికింది. అందులో పాము విషాన్ని గుర్తించిన బీఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సీసాపై ‘మేడిన్ ఫ్రాన్స్’ అని రాసి ఉన్నట్టు తెలిపారు. ఆ విషం కోబ్రాదని, దాని విలువ రూ. 13 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. స్వాధీనం చేసుకున్న విషపు సీసాను అటవీ అధికారులకు అందించారు.