బ్యాటింగ్ కు అనుకూలించని పిచ్ పై ఆర్సీబీ వికెట్లు టపటపా

  • లక్నోలో ఐపీఎల్ మ్యాచ్
  • లక్నో సూపర్ జెయింట్స్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 రన్స్
  • 44 పరుగులు చేసిన డుప్లెసిస్
  • నవీన్ ఉల్ హక్ కు 3 వికెట్లు
లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఏకానా స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ కు వచ్చిన ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. పిచ్ బ్యాటింగ్ కు ఏ మాత్రం సహకరించలేదు. లక్నో సూపర్ జెయింట్స్ తో పోరులో... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులు మాత్రమే చేసింది. 

కెప్టెన్ డుప్లెసిస్ 44 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 31 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 62 పరుగులు జోడించినా, పిచ్ ప్రభావంతో వికెట్లు టపటపా పడ్డాయి. మిడిలార్డర్ లో దినేశ్ కార్తీక్ 16 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. 

మ్యాక్స్ వెల్ (6), అనూజ్ రావత్ (9), సుయాశ్ ప్రభుదేశాయ్ (6) విఫలమయ్యారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3, రవి బిష్ణోయ్ 2, అమిత్ మిశ్రా 2, కృష్ణప్ప గౌతమ్ 1 వికెట్ తీశారు. 

బెంగళూరు బ్యాటింగ్ సమయంలో ఓసారి వర్షం అంతరాయం కలిగించగా, మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా వికెట్ల పతనం కొనసాగింది.


More Telugu News