ఇప్పటి నంది అవార్డుల సీజన్ వేరు.... అవార్డులు వాళ్లకే ఇస్తారు: అశ్వనీదత్

  • కొంతకాలంగా నంది అవార్డుల కార్యక్రమం జరగని వైనం
  • ఇప్పుడు ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ అవార్డులు ఇస్తారన్న అశ్వనీదత్
  • సినిమాలకు అవార్డుల రావాలంటే మరో రెండు మూడేళ్లు పడుతుందని వ్యాఖ్య 
ఒకప్పుడు తెలుగు చిత్రసీమలో నంది అవార్డుల కార్యక్రమం అంటే ఓ పండుగలా జరిగేది. నంది అవార్డు గ్రహీతలకు ఎంతో గుర్తింపు, గౌరవం లభించేవి. కానీ రాష్ట్ర విభజన జరిగాక నంది అవార్డుల వ్యవహారం నిరాదరణకు గురవుతోంది. దీనిపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ స్పందించారు. 

"ఇప్పుడు నడుస్తున్న నంది అవార్డుల సీజన్ వేరు... ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ అంటూ వాళ్లకు అవార్డులు ఇస్తారు. ఇవి సినిమాలకు అవార్డులు ఇచ్చే రోజులు కావు. సినిమాలకు నంది అవార్డులు ఇచ్చే రోజులు రావాలంటే రెండు మూడేళ్లు పడుతుంది. అప్పుడు మనందరం అవార్డులు అందుకోవచ్చు" అని అశ్వనీదత్ వ్యాఖ్యానించారు. 

సూపర్ స్టార్ కృష్ణ నటించిన అలనాటి బ్లాక్ బస్టర్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు 4కే టెక్నాలజీ హంగులు దిద్దుకుంది. త్వరలో ఈ చిత్రాన్ని 4కేలో విడుదల చేస్తున్నారు. దీనిపై హైదరాబాదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అశ్వనీదత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన నంది అవార్డులపై వ్యాఖ్యలు చేశారు.


More Telugu News