మూడో దశ ఉద్యమానికి ఏపీ ఉద్యోగ సంఘాలు సిద్ధం... సీఎస్ కు నోటీసు
- డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగ సంఘాలు
- ఇటీవల రెండో దశ కార్యాచరణ ముగిసిన వైనం
- ఈ నెల 8 నుంచి మూడో దశ ఉద్యమం
- సీఎస్ జవహర్ రెడ్డిని కలిసిన బొప్పరాజు తదితరులు
ఇటీవల రెండో దశ ఉద్యమ కార్యాచరణ ముగించిన ఏపీ ఉద్యోగ సంఘాలు మరోసారి ఉద్యమానికి సిద్ధవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఏపీ జేఏసీ అమరావతి నేతలు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డికి మూడో దశ ఉద్యమ కార్యాచరణ నోటీసును అందించారు.
ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ, ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం భేటీ వివరాలను సీఎస్ కు తెలియజేశామని వెల్లడించారు. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని సీఎస్ ను కోరామని తెలిపారు. కొత్త డీఏ వెంటనే ఇవ్వాలన్న డిమాండ్ ను సీఎస్ ముందుంచినట్టు బొప్పరాజు వివరించారు.
తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 8 నుంచి ఉద్యమ కార్యాచరణ మళ్లీ కొనసాగుతుందని వెల్లడించారు. మూడో దశ కార్యాచరణలో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 30న ఉద్యోగుల సమస్యలపై నిరాహార దీక్ష ఉంటుందని పేర్కొన్నారు.