హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు.. నోటీసులు సస్పెండ్ చేసిన ధర్మాసనం

  • ఉద్యోగుల సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రభుత్వం నోటీసులు
  • రద్దు అంశంపై హైకోర్టు మెట్లు ఎక్కిన అసోసియేషన్ 
  • ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోందని అసోసియేషన్ వాదనలు
  • వాదనల అనంతరం ప్రభుత్వ నోటీసులు రద్దు చేసిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగుల సంఘం రద్దు అంశంపై హైకోర్టు సోమవారం విచారణ జరిగింది. ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను హైకోర్టు ఈ రోజు సస్పెండ్ చేసింది. ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందంటూ ఇటీవల వాణిజ్య పన్నుల శాఖ సర్వీస్ అసోసియేషన్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ హైకోర్టుకు వెళ్లారు.

తాము నిరసనలకు దిగితే ప్రభుత్వం నోటీసులు ఇస్తోందని వారి తరఫు న్యాయవాదులు వాదించారు. గతంలో ఉద్యోగుల వేతనాలకు సంబంధించి గవర్నర్ ను కలిశామని, ఈ అంశంపై కూడా ప్రభుత్వం నుండి నోటీసులు వచ్చినట్లు గుర్తు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వం నోటీసును సస్పెండ్ చేసింది. ఉద్యోగుల తరఫున ఉమేష్ చంద్ర, రవిప్రసాద్ వాదనలు వినిపించారు.


More Telugu News