ఒకసారి అద్దంలో చూసుకో: డేవిడ్ వార్నర్‌పై హర్భజన్ సింగ్ ఘాటు విమర్శలు
- ఎనిమిది మ్యాచ్‌లలో రెండే గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
- ఫెయిల్యూర్‌పై వార్నర్ వైపు భజ్జీ సహా సీనియర్ల వేలు
- వార్నర్ 50 బంతులు ఆడి ఉంటే ఢిల్లీ ఘోరపరాజయం పాలయ్యేదన్న భజ్జీ
- కెప్టెన్‌గా ఫెయిల్ కావడంతో ఫామ్ లో లేడని వ్యాఖ్య
- ఢిల్లీ కెప్టెన్సీని అక్షర్ పటేల్ కు ఇవ్వాలని సూచన
ఐపీఎల్-16లో ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడి, కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. డేవిడ్ వార్నర్ సేన పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. వార్నర్ కెప్టెన్సీ నుండి ఆ జట్టు బ్యాటింగ్ వరకు ఢిల్లీ ఫెయిల్ కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ పై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ జాబితాలో హర్భజన్ సింగ్ కూడా చేరాడు.
భజ్జీ ఈ ఐపీఎల్ లో దారుణ పరాజయాలకు ప్రధానంగా వార్నర్ ను బాధ్యుడిని చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో శనివారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమిపై భజ్జీ స్పందిస్తూ... వార్నర్ కనుక 50 బంతులు ఆడి ఉంటే, అతను ఆడిన ఆ 50 బంతులన్నీ వృథా అయ్యేవన్నాడు. అప్పుడు ఢిల్లీ టీమ్ 50 పరుగుల తేడాతో ఓడిపోయేదని తెలిపాడు. హైదరాబాద్ తో మ్యాచ్ సందర్భంగా వార్నర్ రెండో బంతికే అవుటయ్యాడని, అందుకే ఢిల్లీ కనీసం పోరాడగలిగిందన్నాడు.
ఢిల్లీ మళ్లీ నిలదొక్కుకోవడం ఈ సీజన్ లో కష్టమేనని చెప్పాడు. ఢిల్లీ తిరిగి పుంజుకుంటుందని తాను భావించడం లేదని, ఇందుకు ప్రధాన కారణం డేవిడ్ వార్నర్ అని భజ్జీ చెప్పాడు. అతను పామ్ లో లేడని, అలాగే జట్టును ముందుకు నడిపించడం లేదన్నాడు.
టీమ్ పరాజయానికి అతను సహచరులలోని తప్పులను ఎత్తి చూపుతున్నాడని, కానీ అతనేం చేస్తున్నాడని భజ్జీ ప్రశ్నించాడు. ఎనిమిది మ్యాచ్ లలో వార్నర్ 308 పరుగులు చేశాడని, అది గొప్ప విషయమేమీ కాదని, కానీ స్ట్రైక్ రేటు చూసుకోవాల్సి ఉందన్నాడు. అతను చేసిన 300 పరుగుల వల్ల ఉపయోగమేమీ లేదన్నాడు. పాయింట్ల పట్టికలో ఢిల్లీ అట్టడుగు స్థానంలో ఎందుకు ఉందో కారణం తెలియాలంటే వార్నర్ అద్దంలో చూసుకోవాలన్నాడు.
ఢిల్లీ కెప్టెన్సీని అక్షర్ పటేల్ కు అప్పగించాలని, అప్పుడు భవిష్యత్తు ఉండవచ్చనని చెప్పాడు. ఢిల్లీ ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే మిగిలిన 6 మ్యాచ్ లలో ప్రతి ఒక్కదానిని కచ్చితంగా గెలవాల్సి ఉంది.