దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్
- ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్
- తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ × పంజాబ్ కింగ్స్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై
- 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 67 పరుగులు
ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ తలపడుతుండగా... రెండో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ ఆడనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్- పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ కు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.
సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ లో సీఎస్కే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయానికి తగ్గట్టుగా ఓపెనర్లు దూకుడైన ఆరంభాన్నిచ్చారు. డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ పంజాబ్ కింగ్స్ బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును పరుగులు తీయించారు. వీరిద్దరి జోరుతో చెన్నై సూపర్ కింగ్స్ 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. గైక్వాడ్ 34, కాన్వే 29 పరుగులతో ఆడుతున్నారు.