సీఐడీ అదుపులో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు
- రాజమహేంద్రవరంలో హైటెన్షన్
- సీఐడీ అధికారుల అదుపులో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు
- ఈ ఉదయం వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు
- జగదీశ్వరి, జగజ్జనని చిట్స్ నిర్వహణపై ప్రశ్నిస్తున్న అధికారులు
రాజమహేంద్రవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జగదీశ్వరి, జగజ్జనని చిట్స్ నిర్వహణ వ్యవహారంలో వీరిని రాజమహేంద్రవరం కార్యాలయంలోనే విచారిస్తున్నారు. ఉదయం వీరిని అదుపులోకి తీసుకుని సీఐడీ కార్యాలయానికి తరలించారు.
కాగా, ఆదిరెడ్డి అప్పారావు, వాసుల అరెస్టును టీడీపీ నేత పట్టాభిరామ్ తీవ్రంగా ఖండించారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ తథ్యమని తెలిసే జనం దృష్టి మళ్లించేందుకు ఆదిరెడ్డి కుటుంబంపై సీఐడీని వదిలారని మండిపడ్డారు. ఈ గల్లీ ట్రిక్స్‌కు ప్రజలు మోసపోరన్న విషయాన్ని తాడేపల్లి సైకో గ్రహించాలని వ్యాఖ్యానించారు. ఆదిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని పట్టాభి తెలిపారు.