కొండచరియలతో పాటు కూలిపోయిన రహదారి.. వీడియో ఇదిగో!
- కాఫ్ను-యాంగ్పా ప్రాంతాల మధ్య తెగిపోయిన రోడ్డు
- కొండచరియలు విరిగిపడడంతో మధ్యలో కుంగిన రహదారి
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
అకాల వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా భాబా వ్యాలీలో కొండచరియలు విరిగిపడడంతో ఓ రోడ్డు లోయలోకి జారిపోయింది. రహదారి మధ్యలోకి కూలడంతో కాఫ్ను, యాంగ్పా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొండపై ఉన్న ఈ రహదారిపై తొలుత పగుళ్లు ఏర్పడ్డాయి. నెమ్మదిగా పగుళ్లు పెద్దగా మారడంతో వాహనదారులు జాగ్రత్తగా రాకపోకలు సాగించారు. శనివారం రోడ్డు దాదాపు మొత్తంగా కూలిపోయింది. రోడ్డు కింది భాగంలో కొండచరియలు విరిగిపడడంతో రోడ్డు కూడా తెగిపోయింది. ఈ ఘటన జరిగినపుడు ఆ రహదారిపై వాహనాలు ఏవీ ప్రయాణించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైందని స్థానికులు చెబుతున్నారు. ఇదంతా అక్కడికి దగ్గర్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.
రాష్ట్రంలోని కిన్నౌర్ జిల్లా తాంగ్లింగ్ తెహసిల్ కల్పలో గత గురువారం కొండ చరియలు విరిగిపడడంతో యాపిల్ తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, తోటలపై బండరాళ్లు పరుచుకున్నాయని అధికారులు తెలిపారు. ఇక ఈ నెల 3న సోలన్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడడంతో ఓ పెట్రోల్ పంపు పూర్తిగా ధ్వంసమైంది. కాగా, హిమాచల్ ప్రదేశ్ లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో కొండప్రాంతాల్లోని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.