బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం.. వైసీపీ సమన్వయకర్త పదవికి రాజీనామా

  • నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ జిల్లాల సమన్వయకర్త పదవి నుంచి తప్పుకున్న బాలినేని
  • సొంత నియోజకవర్గంపై మరింత దృష్టిపెట్టేందుకేనన్న మాజీ మంత్రి
  • అసంతృప్తే కారణమంటున్న సన్నిహితులు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ జిల్లాల వైసీపీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తూ అధిష్ఠానానికి లేఖ రాశారు. అనారోగ్యం కారణాలతోపాటు, సొంత నియోజకవర్గంపై మరింత దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు.

బాలినేని రాజీనామా వెనక చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. మంత్రి పదవి నుంచి తప్పించడంతోపాటు తమ జిల్లా నుంచి మరో మంత్రి ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగించడంపై బాలినేని అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, మార్కాపురంలో ఇటీవల సీఎం జగన్ పర్యటన సందర్భంగా తలెత్తిన ప్రొటోకాల్ వివాదం కూడా ఆయనను ఇబ్బంది పెట్టిందని ఈ కారణంగానే ఆయన వైసీపీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేసినట్టు చెబుతున్నారు.


More Telugu News