అమెరికాలో మళ్లీ కాల్పులు... ఐదుగురి మృతి
- టెక్సాస్ లోని క్లీవ్ లాండ్ లో ఘటన
- రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి
- చిన్నారి నిద్రకు ఆటంకం కలుగుతోందన్న పొరుగింటి వారు
- కోపంతో కాల్పులు జరిపిన వ్యక్తి
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత వినిపించింది. టెక్సాస్ లోని క్లీవ్ లాండ్ లో ఓ దుండగుడు తుపాకీతో విరుచుకుపడగా, ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఉండడం స్థానికులను కలచివేసింది. కాల్పులు జరిపిన వ్యక్తి పరారీలో ఉన్నాడు.
ఆ వ్యక్తి ఓ ప్రదేశంలో రైఫిల్ షూటింగ్ ప్రాక్టీసు చేస్తుండగా, పొరుగువారు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ఇంట్లో చిన్నారి నిద్రపోయే వేళయిందని, శబ్దాలు చేయవద్దని అతడిని కోరారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ వ్యక్తి తన తుపాకీని పొరుగింటి వారిపై ఎక్కుపెట్టాడు. దగ్గర్నుంచి కాల్చడంతో వారికి తప్పించుకునే అవకాశం లేకపోయింది.
కాల్పులు జరిగిన సమయంలో ఆ ఇంట్లో 10 మంది వరకు ఉన్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలో ఈ ఏడాది ఇప్పటివరకు 174 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి.