తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
- తిరుమల పర్యటనకు విచ్చేసిన ఏపీ గవర్నర్
- శ్రీవారి ఆలయం వద్ద ఇస్తి కఫాల్ స్వాగతం
- సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుమల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఇస్తి కఫాల్ స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం కోసం గవర్నర్ అబ్దుల్ నజీర్ సంప్రదాయ దుస్తుల్లో వచ్చారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మంటపంలో గవర్నర్ కు వేదాశీర్వచనం అందించారు. ఈవో ధర్మారెడ్డి తీర్థ ప్రసాదాలను అందించారు. గవర్నర్ కు శ్రీవేంకటేశ్వరస్వామి చిత్ర పటాలను బహూకరించారు. ఆయనను శేషవస్త్రంతో సత్కరించారు.
అంతకుముందు, గవర్నర్ తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని అనుసరించి, తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవరాహస్వామి దర్శనం చేసుకున్నారు.