అతీక్ అహ్మద్ మాదిరే నన్నూ చంపేస్తారేమో!: ఎస్పీ నేత ఆజం ఖాన్
- ఇటీవల గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ ను కాల్చి చంపేసిన ముగ్గురు వ్యక్తులు
- నా నుంచి మీకేం కావాలి? అని ప్రశ్నించిన ఆజం ఖాన్
- విద్వేష వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యేగా అనర్హత వేటుకు గురైన ఎస్పీ నేత
గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ మాదిరే తనను కూడా కాల్చి చంపేస్తారేమోనని సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆజం ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. “నా నుంచి, నా పిల్లల నుంచి మీకేం కావాలి? ఎవరైనా వచ్చి మా తలపై కాల్చి మమ్మల్ని చంపేయాలని మీరు అనుకుంటున్నారా? ఇక మిగిలింది అదొక్కటే. నిజాం-ఏ-హింద్‌ను రక్షించండి. చట్టాన్ని కాపాడండి’’ అని ప్రజలను కోరారు.
ఈ రోజు రామ్ పూర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆజం ఖాన్ పాల్గొన్నారు. ‘‘మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. ఎక్కడైనా ఆగాల్సి వస్తే.. కూర్చోండి. అంతేతప్ప వెనక్కి వెళ్లొద్దు. ముందుకు సాగడానికి ప్రయత్నించండి’’ అని సూచించారు.
దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఆజం ఖాన్ బాధపడుతున్నారు. తక్కువ సందర్భాల్లోనే బయటికి వస్తున్నారు. చాలా కాలం తర్వాత మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం బయటికి వచ్చారు. ‘‘మనం మన ఓటు వేస్తాం. అది మన జన్మహక్కు. కానీ దాన్ని మన నుంచి రెండుసార్లు గుంజుకున్నారు. మూడో సారి లాక్కుంటే.. మనకు ఊపిరి పీల్చుకునే హక్కు కూడా ఉండదు’’ అని చెప్పుకొచ్చారు.
2019 ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి, యూపీ ముఖ్యమంత్రి, అధికారులపై చేసిన తీవ్ర ఆరోపణల కేసులో కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయనపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడింది. ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు.