స్కూల్ బస్ వెళుతుండగా డ్రైవర్ కు హార్ట్ ఎటాక్.. 13 ఏళ్ల విద్యార్థి సాహసం

  • వెంటనే బస్ బ్రేక్ లీవర్ పై కాలు పెట్టి నించున్న విద్యార్థి
  • దీంతో నిలిచిపోయిన బస్సు
  • అమెరికాలోని డెట్రాయిట్ లో జరిగిన ఘటన
కొందరు చిన్నారుల్లో ధైర్యం ఎక్కువ. సాహసోపేతంగా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కథనం కూడా ఓ 13 ఏళ్ల విద్యార్థి సాహసం గురించే. స్కూల్ బస్సులో వెళుతుండగా.. డ్రైవర్ కు స్ట్రోక్ లేదా మూర్ఛ రావడంతో అది అదుపు తప్పింది. అది గమనించిన 13 ఏళ్ల ఏడో తరగతి విద్యార్థి దిల్లాన్ వెంటనే డ్రైవర్ క్యాబిన్లోకి వచ్చేశాడు. వెంటనే స్టీరింగ్ ను చేత్తో పట్టుకుని, బ్రేక్ లీవర్ పై కాలు పెట్టి నించున్నాడు. దీంతో బస్సు ఆగిపోయింది. 

ఇందుకు సంబంధించిన వీడియో ఇన్ స్టా గ్రామ్ లో షేర్ అవుతోంది. బస్సు బ్రేక్ పై కాల్ వేసి, వెంటనే 911కు కాల్ చేయాలంటూ తోటి విద్యార్థులను దిల్లాన్ కోరడాన్ని గమనించొచ్చు. అతడు వెంటనే సమయస్ఫూర్తితో, ధైర్యంగా వ్యవహరించడం వల్ల బస్సులోని విద్యార్థులు అందరూ క్షేమంగా బయటపడ్డారు. వేగంగా, చురుగ్గా బాలుడు స్పందించిన తీరును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అమెరికాలోని  డెట్రాయిట్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. (ఇన్ స్టా వీడియో కోసం)


More Telugu News