వరుసగా చెత్త రికార్డులు మూటగట్టుకుంటున్న అర్షదీప్ సింగ్
- నాలుగు ఓవర్లు వేసి 54 పరుగులు సమర్పించుకున్న అర్షదీప్
- అంతకుముందు రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 47 పరుగులు ఇచ్చుకున్న వైనం
- పంజాబ్‌పై 56 పరుగుల భారీ తేడాతో లక్నో విజయం
పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్షదీప్ సింగ్ ఐపీఎల్‌లో వరుసగా చెత్త రికార్డులు మూటగట్టుకుంటున్నాడు. గత రాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌తో మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో అతడి బౌలింగును ఉతికి ఆరేశారు. ఈ మ్యాచ్‌లో 24 ఏళ్ల అర్షదీప్ 4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ మాత్రమే తీసుకుని ఏకంగా 54 పరుగులు సమర్పించుకున్నాడు. అంతకుముందు కూడా అతడి పేరున ఓ చెత్త రికార్డు నమోదైంది. ఈ నెల 5న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీసుకుని 47 పరుగులు ఇచ్చుకున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆ రికార్డును చెరిపేసి మరో చెత్త రికార్డును తన పేర రాసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 56 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 258 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ మరో బంతి మిగిలి ఉండగానే 201 పరుగులకు ఆలౌట్ అయింది.