స్వలింగ వివాహాలకు అనుకూలంగా తీర్పు ఇచ్చే న్యాయమూర్తులను ప్రకృతి శిక్షిస్తుంది: పూరీ శంకరాచార్యులు
- స్వలింగ వివాహాలపై దేశవ్యాప్త చర్చ
- స్వలింగ వివాహాలు మానవాళికే కళంకమన్న పూరీ శంకరాచార్య స్వామి
- ఇలాంటి వ్యవహారాలు మతాధికారుల పరిధిలో ఉంటాయని వ్యాఖ్య
స్వలింగ వివాహాల చట్టబద్ధతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ పూరీ శంకరాచార్య స్వామి, గోవర్ధన పీఠాధిపతి అయిన నిశ్చలానంద సరస్వతి తీవ్రంగా స్పందించారు. ఇవి యావత్ మానవాళికే కళంకమని అన్నారు. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా దానిని అమోదించాల్సిన పని లేదని అన్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం జైపూర్ వచ్చిన ఆయన నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇస్తే, అలా ఇచ్చిన న్యాయమూర్తులను ప్రకృతి వదిలిపెట్టబోదని అన్నారు. శిక్షించి తీరుతుందని హెచ్చరించారు. అయినా, ఇలాంటి వ్యవహారాలు మతాధికారుల పరిధిలో ఉంటాయని, కోర్టులు నిర్ణయాలు తీసుకోలేవని అన్నారు. మత వ్యవహారాల్లో వివాహానికే మొదటి స్థానమని నిశ్చలానంద సరస్వతి పేర్కొన్నారు.