పంజాబ్ పోరాటం చాల్లేదు... సూపర్ జెయింట్స్ దే విజయం
- మొహాలీలో పరుగుల వాన
- మొదట 20 ఓవర్లలో 5 వికెట్లకు 257 రన్స్ చేసిన లక్నో
- లక్ష్యఛేదనలో 201 పరుగులకు పంజాబ్ ఆలౌట్
- కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్
- 4 వికెట్లు తీసిన యశ్ ఠాకూర్
- 3 వికెట్లతో సత్తా చాటిన నవీన్ ఉల్ హక్
భారీ స్కోర్ల మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ విజేతగా నిలిచింది. పంజాబ్ కింగ్స్ పై మొహాలీలో జరిగిన మ్యాచ్ లో లక్నో 56 పరుగుల తేడాతో నెగ్గింది. 258 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ 19.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌట్ అయింది.
అధర్వ తైడే 66, సికిందర్ రజా 36 పరుగులతో రాణించినా, వారిద్దరూ కీలక దశలో అవుట్ కావడం పంజాబ్ చేజింగ్ పై ప్రభావం చూపింది. దానికితోడు, ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ బాగుంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ మోహరింపు సత్ఫలితాలు ఇచ్చింది. ఆ జట్టు ఫీల్డర్లు కొన్ని చక్కని క్యాచ్ లు అందుకుని పంజాబ్ ఓటమికి కారణమయ్యారు.
లక్నో బౌలర్లలో యశ్ ఠాకూర్ 4, నవీన్ ఉల్ హక్ 3, రవి బిష్ణోయ్ 2, మార్కస్ స్టొయినిస్ 1 వికెట్ తీశారు. కాగా, ఈ ఇన్నింగ్స్ లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ నికోలాస్ పూరన్ తప్ప మిగతా 9 మంది బౌలింగ్ చేయడం విశేషం.
పంజాబ్ బ్యాటర్లు భారీ షాట్లు కొట్టకుండా, తన బౌలర్లను కేఎల్ రాహుల్ మార్చి మార్చి ప్రయోగించాడు. ఈ ఎత్తుగడ మంచి ఫలితాలను ఇచ్చింది. ప్రమాదకర హిట్టర్ శామ్ కరన్ 21, జితేశ్ శర్మ 24 పరుగులు చేశారు.
అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ రికార్డు స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 257 పరుగులు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు. స్టొయినిస్ 72, కైల్ మేయర్స్ 54, ఆయుష్ బదోనీ 43, నికోలాస్ పూరన్ 45 పరుగులు చేశారు.
ఈ విజయంతో లక్నో జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోగా, పంజాబ్ కింగ్స్ ఆరోస్థానంలో నిలిచింది.