మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపండి: అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

  • కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
  • డ్రగ్స్ అంశంపై సమీక్ష
  • మాదకద్రవ్యాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ
  • నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని నిర్దేశం
ఏపీ సీఎం జగన్ ఇవాళ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ అంశంపై సమీక్షించారు. డ్రగ్స్ తయారీ, రవాణా, పంపిణీలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, పోలీసులు ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. 

మాదకద్రవ్యాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాల పోలీసు కార్యాలయాల్లో ప్రత్యేక డివిజన్లు ఏర్పాటు చేయాలని, నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులకు నిర్దేశించారు. ప్రతి కళాశాలలోనూ ఎస్ఈబీ టోల్ ఫ్రీ నెంబరు ప్రదర్శించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. 

ఇక, 'స్పందన' కార్యక్రమానికి మెరుగైన రూపమే 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమం అని వెల్లడించారు. మే 9 నుంచి జగనన్నకు చెబుదాం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇందుకోసం 1902 నెంబరును అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. సమస్యల పరిష్కారంపై నాణ్యతకు పెద్దపీట వేస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు.


More Telugu News