సీబీఐ కోర్టుకు హాజరైన ఎర్ర గంగిరెడ్డి
- వివేకా హత్య కేసును విచారించిన నాంపల్లి సీబీఐ కోర్టు
- గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డిలను హాజరుపరిచిన పోలీసులు
- తదుపరి విచారణ జూన్ 8కి వాయిదా
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ఈ రోజు నాంపల్లి సీబీఐ కోర్టులో జరిగింది. ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి సహా సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డిలను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణను జూన్ 8కి కోర్టు వాయిదా వేసింది.
వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు గురువారం రద్దు చేసింది. మే 5లోగా సీబీఐ ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. లేనిపక్షంలో అరెస్టు చేసుకోవచ్చని దర్యాప్తు సంస్థకు సూచించింది.
వివేకా హత్య కేసు దర్యాప్తును పూర్తి చేయడానికి జూన్ 30 వరకు సీబీఐకి సుప్రీంకోర్టు గడువు ఇచ్చిన నేపథ్యంలో ఆ రోజు వరకు గంగిరెడ్డికి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఆ గడువు ముగిశాక జులై 1న రూ.లక్ష పూచీకత్తు తీసుకుని అతడికి బెయిల్ మంజూరు చేయాలని సీబీఐ కోర్టును ఆదేశించింది.