అతి తక్కువ రీచార్జ్ తో ఎయిర్ టెల్ ఫైబర్ కనెక్షన్

  • రూ.219తో నెలవారీ రీచార్జ్ ప్లాన్
  • ఒకేసారి ఏడాదికి రూ.3,101 రీచార్జ్ చేసుకోవాలి
  • ప్లాన్ లో భాగంగా ఉచిత రూటర్
  • 10 ఎంబీపీఎస్ వేగంతో నెట్ సేవలు
ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్ టెల్ ఎవరూ ఊహించని ధరకు బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. రూ.219కే ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ మంత్లీ రీచార్జ్ ప్లాన్ ను ఆవిష్కరించింది. బ్రాడ్ బాండ్ లైట్ అని దీనికి పేరు పెట్టింది. బడ్జెట్ ధరలో ప్లాన్ కోసం చూసే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది.

కాకపోతే ఇది మంత్లీ ప్లాన్ అయినప్పటికీ, ఒకేసారి ఏడాదికి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే రూ.3,101తో ఒకేసారి రీచార్జ్ చేసుకోవాలి. దీనితోపాటు రూటర్ ఉచితంగా వస్తుంది. ప్లాన్ లో భాగంగా 10ఎంబీపీఎస్ వేగంతో బ్రాడ్ బ్యాండ్ సేవలు పొందొచ్చు. కాకపోతే ఈ నూతన ప్లాన్ అన్ని రాష్ట్రాల్లోనూ విడుదల చేయలేదు.  ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఈస్ట్ లో లభిస్తుంది. పైగా ఇది చౌక్ ప్లాన్ కావడంతో ఇందులో ఉచిత ఓటీటీ, టీవీ చానల్స్ వంటి ప్రయోజనాలేవీ లేవు. 

ఎయిర్ టెల్ లో రూ.219 తర్వాత చౌక ప్లాన్ అంటే రూ.499. ఇందులో 40ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. అన్ లిమిటెడ్ నెట్, కాల్స్ చేసుకోవచ్చు. జియో గత నెలలో రూ.198తో తీసుకొచ్చిన బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ కు పోటీగా ఎయిర్ టెల్ రూ.219 ప్లాన్ ను తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. జియో రూ.198 నెలవారీ ప్లాన్ లో 10ఎంబీపీఎస్ వేగంతో నెట్ లభిస్తుంది.


More Telugu News