కరోనాతో మరో 44 మంది మృతి
- దేశంలో కొత్తగా 7,533 కరోనా కేసులు
- గత 24 గంటల్లో నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన
- ప్రస్తుతం 53, 852 క్రియాశీల కేసులు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 7,533 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 53,852 క్రియాశీల కేసులు ఉన్నాయని తెలిపింది. అదే సమయంలో గత 24 గంటల వ్యవధిలో వైరస్ కారణంగా 44 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,468కి చేరింది.
వైరస్ బారి నుంచి ఇప్పటి వరకు 4,43,47,024 మంది కోలుకున్నారు. కాగా, పాజిటివ్ కేసుల్లో 0.12 శాతం మాత్రమే క్రియాశీలకంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.69 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది.