రాహుల్‌ గాంధీని చంపుతానంటూ బెదిరింపు.. 60 ఏళ్ల వ్యక్తి అరెస్ట్

  • గత ఏడాది నవంబర్‌లో భారత్‌ జోడో యాత్ర సందర్భంగా రాహుల్‌కు బెదిరింపు లేఖ
  • యాత్ర ఇండోర్‌లోకి ప్రవేశించగానే బాంబు దాడి చేస్తానని నిందితుడి హెచ్చరిక
  • స్థానిక స్వీట్ షాప్ వద్ద లేఖ లభ్యం
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు, తాజాగా నిందితుడి అరెస్ట్
గత ఏడాది నవంబర్‌లో భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని చంపుతానంటూ బెదిరింపు లేఖ రాసిన దయా సింగ్ (60) అలియాస్ అయిషీలాల్ సింగ్‌ను గురువారం మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ భద్రతా చట్టం కింద అతడిని ఇండోర్ నగరంలో అదుపులోకి తీసుకున్నారు. 

భారత్‌ జోడో యాత్ర ఇండోర్ నగరంలో ప్రారంభం కానున్న సందర్భంగా దయాసింగ్ ఈ బెదిరింపులకు దిగాడు. యాత్ర ఇండోర్‌కు చేరుకున్న వెంటనే రాహుల్‌పై బాంబు దాడి చేస్తానని లేఖలో హెచ్చరించాడు. స్థానికంగా ఉన్న ఓ స్వీట్ షాప్ వద్ద పోలీసులకు ఈ లేఖ లభించింది. అప్పట్లో పోలీసులు ఈ లేఖను గుర్తుతెలియని వ్యక్తి రాశాడంటూ ఐపీసీ సెక్షన్ 507 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


More Telugu News