27 సార్లు తలపడ్డ చెన్నై, రాజస్థాన్... అత్యధిక సార్లు ఎవరు గెలిచారంటే..!

  • 27 సార్లు తలపడి, 15 సార్లు గెలిచిన చెన్నై, 12 సార్లు రాజస్థాన్ విన్
  • చెన్నై సూపర్ కింగ్స్ హయ్యెస్ట్ స్కోర్ 246
  • రాజస్థాన్ అత్యధిక స్కోర్ 223
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ చేస్తోంది. రాజస్థాన్ ఓపెనర్స్ ప్రారంభ ఓవర్లలో అదరగొట్టారు. మూడు ఓవర్లలోనే 42 పరుగులు చేశారు. పవర్ ప్లే ముగిసేసరికి రాజస్థాన్ వికెట్లు ఏమీ పోకుండానే 64 పరుగులు చేసింది. ఐపీఎల్ 2023లో ఇది 37వ మ్యాచ్.

ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్ర చూస్తే... ఈ రెండు జట్లు 27 సార్లు తలపడ్డాయి. ఇందులో 15 సార్లు చెన్నై, రాజస్థాన్ 12 మ్యాచ్ లలో గెలిచాయి. ఫలితం తేలనివి ఏవీ లేవు. ఈ రెండు జట్లలో చెన్నై అత్యధిక స్కోర్ 246 కాగా, అత్యల్ప స్కోర్ 109. రాజస్థాన్ అత్యధిక స్కోర్ 223, అత్యల్ప స్కోర్ 126. 

అయితే, గత 5 మ్యాచ్ లలో ఫలితం చూస్తే రాజస్థాన్ 4 మ్యాచ్ లు గెలిచింది.

నేటి తుది జట్లు

రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు యశస్వి జైపాల్, జోస్ బట్లర్, దేవ్ దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్), హెట్ మేయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జేసన్ హోల్డర్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యజ్వేంద్ర చాహల్.

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, అజింక్య రహానే, మొయిన్ అలీ, శివమ్ దుబే, రవీంద్ర జడెజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), మతీషా పతిరణ, తుషార్ దేశ్ పాండే, మహీశ్ తీక్షణ, ఆకాశ్ సింగ్.


More Telugu News