విద్యార్థులు ఇక పబ్లిషర్లు, డిస్ట్రిబ్యూటర్లపై ఆధారపడనక్కర్లేదు: విజయసాయిరెడ్డి
- పీడీఎఫ్ రూపంలో టెక్ట్స్ బుక్స్ విడుదల చేసిన సర్కారు
- 1 నుంచి 10వ తరగతి బుక్స్ ఇక ఆన్ లైన్ లో
- ఇదొక చారిత్రాత్మక చర్య అని పేర్కొన్న విజయసాయి
ఏపీ ప్రభుత్వం 1 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను పీడీఎఫ్ రూపంలో ఆన్ లైన్ లో ఉంచిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో విద్యా సంస్కరణల్లో భాగంగా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. టెక్ట్స్ బుక్ లు లేకపోయినా, ఈ పీడీఎఫ్ ప్రతులను ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని పాఠ్యాంశాలను చదువుకోవచ్చు.
దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఉపయోగించే 353 టెక్ట్స్ పుస్తకాల సాఫ్ట్ కాపీలను ప్రభుత్వం ఆన్ లైన్ లో విడుదల చేసిందని వెల్లడించారు. ఇదొక చారిత్రాత్మక చర్య అని కొనియాడారు.
విద్యార్థులు సులువుగా ఈ పాఠ్యపుస్తకాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని, కోర్సు మెటీరియల్స్ చదువుకోవచ్చని విజయసాయి వివరించారు. ఇకపై టెక్ట్స్ పుస్తకాల కోసం పబ్లిషర్లు, డిస్ట్రిబ్యూటర్లపై ఆధారపడాల్సిన అవసరం లేదని తెలిపారు.