కేసీఆర్ దక్షిణాదిన హ్యాట్రిక్ సాధించి చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు: కేటీఆర్ ధీమా

  • తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే అన్న కేటీఆర్
  • 90 నుంచి 100 సీట్లను బీఆర్ఎస్ సాధిస్తుందని ధీమా
  • జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ అరంగేట్రం చేస్తారని వెల్లడి 
తెలంగాణలో మరోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని మంత్రి కేటీఆర్ అన్నారు. 90 నుంచి 100 సీట్లను గెలుపొంది మళ్లీ అధికారాన్ని చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. హ్యాట్రిక్ సాధించిన తొలి దక్షిణాది ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రపుటల్లోకి ఎక్కుతారని చెప్పారు. పార్టీ పేరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారినా... పార్టీ డీఎన్ఏ, అజెండా, పార్టీ గుర్తు, నాయకుడు మారలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తమ పార్టీ సీఎం అభ్యర్థి అని... బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా వారి సీఎం అభ్యర్థులు ఎవరో ప్రకటించాలని సవాల్ విసిరారు. 

అప్పుడు ఏ పార్టీకి ఓటు వేయాలో ప్రజలు ముందుగానే నిర్ణయించుకుంటారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లలో డిపాజిట్లు కోల్పోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికి కూడా దూరమవుతుందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లను తాము సమ దూరంలో ఉంచుతామని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ అరంగేట్రం చేస్తారని... అది దేశ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో కాలమే చెప్పగలదని అన్నారు.


More Telugu News