కర్ణాటకలో బీజేపీకి రికార్డు మెజారిటీ ఖాయం: ప్రధాని మోదీ
- రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకుంటామన్న ప్రధాని
- రాష్ట్ర బీజేపీ కార్యకర్తలతో మాట్లాడిన ప్రధాని మోదీ
- కాంగ్రెస్ వారెంటీ ముగిసిందని ఎద్దేవా
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రికార్డు మెజారిటీ సాధిస్తుందని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ ఈ రోజు బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు. ఎన్నికల్లో పార్టీ గెలుస్తుందని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
‘రాష్ట్ర ప్రజల మన్ననలు పొందేందుకు ఒకటి రెండు రోజుల్లో కర్ణాటకలో పర్యటిస్తాను. రాష్ట్రంలో ప్రచారం చేసిన బీజేపీ నేతలు తాము ఎంతో అభిమానాన్ని చూరగొన్నారని చెప్పారు. ఇది బీజేపీపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోంది. కాంగ్రెస్ అంటే తప్పుడు హామీలు, కాంగ్రెస్ అంటే అవినీతికి గ్యారెంటీ. ఎలాంటి హామీ ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ఉంది. వారి వారెంటీ కూడా ముగిసింది’ అని విమర్శించారు.
గత 9 సంవత్సరాలలో భారతదేశం ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడిదారులకు ముఖ్యమైన కేంద్రంగా మారిందన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కారణంగా కర్ణాటక దీని నుండి భారీ ప్రయోజనం పొందిందని చెప్పారు.