ఈ అలవాట్లు ఉంటే డిమెన్షియా ముప్పు తప్పదట!
- వెంటనే మానుకోవాలంటున్న ఆరోగ్య నిపుణులు
- జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవద్దని సూచన
- తరచుగా ముక్కులో వేలుపెట్టుకోవడమూ ఓ కారణమేనని వెల్లడి
- హెడ్ ఫోన్స్ లో ఫుల్ వాల్యూమ్ తో పాటలు వినడం వల్ల ముప్పు తప్పదట
జంక్ ఫుడ్ అతిగా లాగిస్తున్నారా.. చుట్టూ ఉన్నవారితో కలవకుండా ఒంటరిగా ఉంటున్నారా.. అయితే మీకు వృద్ధాప్యంలో డిమెన్షియా ముప్పు పొంచి ఉన్నట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజువారీగా చేసే కొన్ని పనుల వల్ల డిమెన్షియా (మతిమరపు) బారినపడే ముప్పు పెరుగుతుందని చెబుతున్నారు. ఈ చెడు అలవాట్లకు వెంటనే స్వస్తి పలకాలంటూ సూచిస్తున్నారు. నిపుణులు చెబుతున్న ఆ అలవాట్లు ఏంటంటే.. సోషల్ గా కలవకుండా ఎక్కువసేపు ఒంటరిగా గడపడం.
ఒంటరిగా గడపడం..
చాలామంది బిడియం వల్లో మరో కారణం వల్లో చుట్టూ ఉన్నవాళ్లతో కలిసిపోవడానికి సంకోచిస్తుంటారు. ఎవరూలేని ఏకాంత ప్రదేశంలో గడపడానికి ఇష్టపడుతుంటారు. దీనివల్ల మెదడుపై ప్రభావం పడుతుందని భవిష్యత్తులో ఆలోచనా శక్తిని కోల్పోయి చిత్తవైకల్యంతో బాధపడే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ముక్కులో వేలుపెట్టుకునే అలవాటు..
సిల్లీగా అనిపించినప్పటికీ ముక్కులో వేలు పెట్టి కెలుక్కోవడం కూడా డిమెన్షియా ముప్పును పెంచుతుందట. ఈ అలవాటు వల్ల నాసికా కుహరం మరియు మెదడు మధ్య విస్తరించిన నాడిపైన ప్రభావం పడుతుందని, కేంద్ర నాడీ వ్యవస్థలోకి అల్జీమర్స్ కు కారణమయ్యే అమిలాయిడ్ బీటా ప్రోటీన్‌ను చొప్పిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో వయసు పైబడిన తర్వాత చిత్తవైకల్యానికి గురయ్యే ముప్పు పెరుగుతుందని హెచ్చరించారు.
జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం.. అనారోగ్యకరమైన కొవ్వు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్ అతిగా తినడం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. బర్గర్లు, పిజ్జాలు, ఫ్రైస్, చిప్స్, కోలా పానీయాలలో అవసరానికి మించి ఉండే షుగర్ వల్ల ఇన్ ఫ్లమేషన్, మెదడుపై ఒత్తిడి పెంచుతుందని తెలిపారు. మెదడు పనితీరును ఇది ప్రభావితం చేస్తుందని, నేర్చుకునే సామర్థ్యాన్ని, జ్ఞాపకశక్తిని క్షీణించేలా చేస్తుందని వివరించారు.
సరైన నిద్రలేకపోవడం.. రోజంతా అలసిన శరీరంతో పాటు మెదడుకు కూడా నిద్రలోనే విశ్రాంతి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కంటినిండా నిద్రించడం ద్వారా మెదడు చురుగ్గా ఉంటుందని తెలిపారు. అయితే, జీవనశైలిలో మార్పుల వల్ల నిద్రకు దూరమయ్యే వారిలో, రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని ఉండే వారిలో డిమెన్షియా ముప్పు రెండు రెట్లు పెరుగుతుందని హెచ్చరించారు. రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రించేవారితో పోలిస్తే తక్కువగా నిద్రించే వారు తొందరగా చనిపోయే అవకాశం కూడా ఎక్కువేనట!
హెడ్ ఫోన్స్ లో ఎక్కువ వాల్యూమ్ తో.. హెడ్ ఫోన్స్ జాగ్రత్తగా వాడాలని, పరిమితికి మించి వాల్యూమ్ పెంచొద్దని నిపుణులు సూచిస్తున్నారు. పెద్ద శబ్దంతో హెడ్ ఫోన్స్ లో పాటలు వినడం కూడా డిమెన్షియా ముప్పును పెంచుతుందని అంటున్నారు. రోజులో 30 నిమిషాల పాటు ఇలా చేస్తే మెదడు పనితీరు మందగిస్తుందని, చుట్టూ ఉన్న శబ్దాలను మెదడు రికార్డు చేసుకోవడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుందని తెలిపారు.