దీపావళిని సెలవుదినంగా ప్రకటించిన పెన్సిల్వేనియా రాష్ట్రం

  • దీపావళిని సెలవుదినంగా గుర్తించే బిల్లుకు రాష్ట్ర సెనేట్‌లో ఏక గ్రీవ ఆమోదం
  • ఈ ఏడాది ఫిబ్రవరిలో బిల్లును సభలో ప్రవేశపెట్టిన సెనేటర్లు రాథ్మన్, నిఖిల్ సావల్
  • బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు లభించిందంటూ నిఖిల్ ట్వీట్
  • దేశంలోని సాంస్కృతిక వైవిధ్యానికి పెద్దపీట వేశామన్న రాథ్మన్ 
అమెరికాలోని హిందువుల మనోభావాలను గౌరవిస్తూ పెన్సిల్వేనియా రాష్ట్రం తాజాగా దీపావళిని అధికారిక సెలవుదినంగా ప్రకటించింది. ఈ దిశగా ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదముద్ర లభించినట్టు పెన్సిల్వేనియా సెనేటర్ నిఖిల్ సావల్ తాజాగా ట్వీట్ చేశారు. దీపావళిని సెలవుదినంగా గుర్తిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి సెనేట్ ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టు పేర్కొన్నారు. ఈ బిల్లును స్టేట్ సెనేటర్ గ్రెగ్ రాథ్మన్, సెనేటర్ నిఖిల్ సావల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. 

పెన్సిల్వేనియాలో దక్షిణాసియాకు చెందిన సుమారు 2 లక్షల మంది నివసిస్తుండగా, వారిలో అనేక మంది దీపావళి పండుగ జరుపుకుంటారు. ‘‘దీపావళిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించడం ద్వారా మన సమున్నత సాంస్కృతిక వైవిధ్యానికి పెద్దపీట వేసినట్టయ్యింది’’ అని రాథ్మన్ పేర్కొన్నారు. అయితే, దీపావళి నాడు ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లకు సెలవు ఇవ్వాల్సిన అవసరం లేదని బిల్లులో పేర్కొన్నట్టు స్థానిక మీడియా పేర్కొంది.

USA

More Telugu News