దంతెవాడలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో 11 మంది జవాన్ల మృతి
- మినీ బస్సు టార్గెట్ గా ఐఈడీ అటాక్ చేసిన మావోయిస్టులు
- 10 మంది జవాన్లు, 1 వాహన డ్రైవర్ మృతి
- మావోయిస్ట్ వ్యతిరేక ఆపరేషన్ కోసం వెళ్లి వస్తుండగా ఘటన
ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లా దంతెవాడలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని మందుపాతరను పేల్చారు. మినీ బస్సు టార్గెట్ గా ఐఈడీ అటాక్ చేయగా 10 మంది జవాన్లు, వాహన డ్రైవర్ మృత్యువాత పడ్డారు. మృతులను డీఆర్జీ విభాగానికి చెందిన జవాన్లుగా గుర్తించారు. మావోయిస్ట్ వ్యతిరేక ఆపరేషన్ కోసం వీరు దంతెవాడ వెళ్లారు. ఆపరేషన్ ముగించుకొని, తిరిగి వస్తుండగా ఐఈడీని పేల్చారు మావోయిస్టులు. భద్రతా బలగాలపై దాడి చేస్తామని గతవారమే హెచ్చరిక లేఖను విడుదల చేశారు మావోయిస్టులు. సంఘటనా స్థలం వద్ద అదనపు బలగాలను మోహరించారు. మావోయిస్టుల దాడిపై ఐజీ... ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
దంతెవాడ ఘటనపై ముఖ్యమంత్రి భూపేష్ భాగెల్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ నక్సలైట్లను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భూపేష్ భాగెల్ తో మాట్లాడారు. మావోయిస్టుల కదలికలపై ఆరా తీశారు. కేంద్రం నుండి అవసరమైన సాయం తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. 2018 తర్వాత అతిపెద్ద మావోయిస్టు ఘాతుకం ఇది. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ కు 450 కిలో మీటర్ల దూరంలో ఈ విషాదం చోటు చేసుకుంది.