ప్రభాస్ ను ఒప్పించిన క్రిష్ .. హీరోయిన్ గా అనుష్క?

  • మరో భారీ ప్రాజెక్టును లైన్లో పెట్టే పనిలో క్రిష్ 
  • 'బాహుబలి' నిర్మాతలను ఒప్పించాడంటూ ప్రచారం
  • ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని టాక్ 
  • అనుష్కను రంగంలోకి దింపే ప్రయత్నాలు 
ఇటీవల కాలంలో అనుష్క సినిమాల సంఖ్యను బాగా తగ్గించి వేసింది. 'బాహుబలి 2' తరువాత నాయిక ప్రధానమైన కథలను మాత్రమే చేస్తూ వచ్చిన ఆమె, ప్రస్తుతం యూవీ బ్యానర్లో ఒక సినిమా మాత్రమే చేస్తోంది. అలాంటి అనుష్క మళ్లీ ప్రభాస్ తో కలిసి కనువిందు చేసే అవకాశం ఉందనే టాక్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది.

ప్రస్తుతం 'వీరమల్లు' సినిమాతో బిజీగా ఉన్న దర్శకుడు క్రిష్, ప్రభాస్ హీరోగా ఒక కథను సిద్ధం చేశారట. 'బాహుబలి' నిర్మాతలైన శోభు యార్లగడ్డ - ప్రసాద్ దేవినేనికి ఆ కథను వినిపించగా, వారు ముందుకు వచ్చినట్టుగా బలమైన ప్రచారమైతే జరుగుతోంది. ప్రభాస్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో కథానాయికగా అనుష్క పేరు తెరపైకి వచ్చింది. ఈ జంటకి ఉన్న క్రేజ్ కారణంగానే ఈ కాంబినేషన్ ను సెట్ చేశారని అంటున్నారు. ఇక ఈ సినిమా ఏ జోనర్ కి చెందినది అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. 



More Telugu News