టీవీ5 వేదికగా చర్చకు రావాలంటూ ఉండవల్లికి జీవీ రెడ్డి సవాల్... చర్చకు రెడీ అన్న ఉండవల్లి
- మార్గదర్శి వ్యవహారంలో విమర్శలు చేస్తున్న ఉండవల్లి
- టీవీ5 మూర్తి షో వేదికగా చర్చకు రావాలంటూ జీవీ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్
- సవాల్ స్వీకరిస్తున్నానని మూర్తికి ఫోన్ చేసి చెప్పిన ఉండవల్లి
మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంలో ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. వైసీపీ నేతలు ఈ విషయంలో ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావును తప్పు పడుతున్నారు. మరోవైపు మార్గదర్శిపై కేసు వేసిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ క్రమం తప్పకుండా ప్రెస్ మీట్లు పెడుతూ ఈ అంశంపై మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ఉండవల్లికి బహిరంగ సవాల్ విసిరారు.
టీవీ5లో ప్రముఖ న్యూస్ అనలిస్ట్ మూర్తి నిర్వహించే షో వేదికగా మార్గదర్శి అంశంపై చర్చకు రావాలని ఉండవల్లిని జీవీ రెడ్డి ఛాలెంజ్ చేశారు. రామోజీరావు అంటేనే తప్పు చేసే వ్యక్తి అన్నట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ క్రమంలో, జీవీ రెడ్డి చేసిన ఛాలెంజ్ ను ఉండవల్లి స్వీకరించారు. సవాల్ ను స్వీకరిస్తున్నట్టు మూర్తికి ఫోన్ చేసి చెప్పారు. చర్చకు తేదీ, సమయం, వేదికను త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు.