మిల్లర్ కు తోడు వాళ్లిద్దరు కూడా బాదారు... 207 పరుగులు చేసిన టైటాన్స్
- గుజరాత్ టైటాన్స్ × ముంబయి ఇండియన్స్
- అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసిన టైటాన్స్
- గిల్ అర్ధసెంచరీ... మిల్లర్, మనోహర్, తెవాటియా దూకుడు
ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో ఐపీఎల్ డిఫెండింగ్ చాంప్ గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ అర్ధసెంచరీ సాధించగా.... డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, తెవాటియా ధాటిగా ఆడడంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసింది.
ఓపెనర్ గిల్ 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 56 పరుగులు చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (13), విజయ్ శంకర్ (19) క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. అయితే, అసలు విధ్వంసం ఆ తర్వాత ప్రారంభమైంది.
అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్ జోడీ భారీ షాట్లతో ముంబయి ఇండియన్స్ బౌలర్లను బెంబేలెత్తించింది. మనోహర్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేయగా... మిల్లర్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 46 పరుగులు రాబట్టాడు. ఇక, రాహుల్ తెవాటియా వచ్చీ రావడంతోనే విరుచుకుపడ్డాడు. తెవాటియా కేవలం 5 బంతులాడి 3 సిక్సులు బాదాడు. 20 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఈ మ్యాచ్ లో ముంబయి ఫీల్డింగ్ పేలవంగా సాగింది. ముంబయి ఫీల్డర్లు పలు క్యాచ్ లు జారవిడవడం గుజరాత్ టైటాన్స్ కు కలిసొచ్చింది.