బ్రిటన్ రాజు పట్టాభిషేకం అంటే ఖర్చు ఇలాగే ఉంటుంది!
- బ్రిటన్ రాజుగా చార్లెస్
- బ్రిటీష్ రాచరికపు పరంపరలో ఆయన ఇక కింగ్ చార్లెస్-3
- పట్టాభిషేకానికి రూ.1,020 కోట్లు ఖర్చు
- మే 6వ తేదీన పట్టాభిషేకం
- లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో కార్యక్రమం
- హాజరుకానున్న ప్రపంచ ప్రముఖులు
బ్రిటన్ రాజు ఫిలిప్స్ 2021లో కన్నుమూశారు. ఆ మరుసటి ఏడాదే బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 తుదిశ్వాస విడిచారు. అర్హత ప్రకారం ఆమె కుమారుడు చార్లెస్ రాజుగా నియమితులయ్యారు. ఆయనను బ్రిటీష్ రాచరికపు పరంపరంలో కింగ్ చార్లెస్-3గా పిలవనున్నారు. ఇప్పుడాయన పట్టాభిషేకానికి బ్రిటన్ సన్నద్ధమవుతోంది.
మే 6వ తేదీన జరిగే ఈ మహోత్సవానికి రూ.1,020 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ఖర్చంతా బ్రిటన్ ప్రభుత్వానిదే. బ్రిటీష్ రాజ వంశీకులు వివాహాలను సొంత ఖర్చుతోనే చేసుకుంటారు. పట్టాభిషేకం ఖర్చు మాత్రం ప్రభుత్వమే భరిస్తుంది.
కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకాన్ని 3.7 కోట్ల మంది వీక్షిస్తారని అంచనా. నాడు 1953లో బ్రిటన్ రాణిగా ఎలిజబెత్-2 పట్టాభిషేకం కార్యక్రమాన్ని 3 లక్షల మంది నేరుగా వీక్షించారు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో ఈ కార్యక్రమం జరగనుంది. 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ కుర్చీని ఈ పట్టాభిషేకం కోసం బయటికి తీస్తున్నారు.
అయితే, ఈ పట్టాభిషేకానికి అయ్యే ఖర్చు కంటే, ఈ కార్యక్రమం టీవీ హక్కుల విక్రయం ద్వారా ఎక్కువ మొత్తం వస్తుందని భావిస్తున్నారు. బ్రిటన్ కు సంబంధించి ఇది అత్యున్నత కార్యక్రమం కావడంతో వివిధ దేశాధినేతలు, ప్రతినిధులు, ప్రముఖులు హాజరుకానున్నారు.
ఇక, మే 6వ తేదీనే పట్టాభిషేకం జరగడానికి ఓ కారణం ఉంది. ఓ ఫుట్ బాల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ కు ఇబ్బంది లేకుండా కింగ్ చార్లెస్ ఈ తేదీలో తమ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారట.