వివేకా హత్య కేసు: సునీత, రాజశేఖర్ రెడ్డి ఇద్దరినీ కలిపి విచారించిన సీబీఐ అధికారులు

  • వివేకా హత్య కేసులో కీలక వ్యక్తులను విచారిస్తున్న సీబీఐ
  • నేడు సీబీఐ కార్యాలయానికి వివేకా కుమార్తె, అల్లుడు
  • ఇద్దరినీ 3 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ అధికారులు
  • వాంగ్మూలం నమోదు
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ కీలక వ్యక్తులను విచారిస్తోంది. ఈ మధ్యాహ్నం వివేకా కుమార్తె డాక్టర్ సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిలను విచారించింది. సునీత, రాజశేఖర్ రెడ్డి ఇద్దరినీ కలిపి సీబీఐ అధికారులు 3 గంటల పాటు ప్రశ్నించారు. వారిరువురి వాంగ్మూలం నమోదు చేశారు. 

వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కావడం ఇది రెండోసారి. మూడ్రోజుల కిందట తొలిసారిగా ఆయనను ప్రశ్నించారు. ఆయన నుంచి మరింత సమాచారం సేకరించేందుకు నేడు మరోసారి విచారణకు పిలిచారు. కాగా, విచారణ ముగిసిన అనంతరం సునీత, రాజశేఖర్ రెడ్డి సీబీఐ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.


More Telugu News