డీ గ్లామర్ రోల్ .. ఈ సారి పాయల్ వంతు!
- గ్రామీణ నేపథ్యంలో నడుస్తున్న కథలు
- తెలుగు తెరపై డీ గ్లామర్ రోల్స్ జోరు
- ఆ తరహా పాత్రల పట్ల హీరోయిన్స్ ఆసక్తి
- స్టార్ హీరోయిన్స్ బాటలో పాయల్
ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై గ్రామీణ నేపథ్యంలోని కథల సంఖ్య పెరుగుతూపోతోంది. మారుమూల గ్రామాల్లో .. అడవికి సమీపంగా ఉండే గిరిజన గూడాల నేపథ్యంలో కథలు నడుస్తున్నాయి. దాంతో కథకి తగినట్టుగా కథానాయికలు డీ గ్లామర్ రోల్స్ చేయవలసి వస్తోంది. చిత్రమేమిటంటే ఇలా హీరోయిన్స్ డీ గ్లామర్ గా కనిపించిన సినిమాలన్నీ హిట్ కావడం.
సుకుమార్ దర్శకత్వం వహించిన 'రంగస్థలం' సినిమాలో సమంత డీ గ్లామర్ రోల్ చేసింది. పల్లెటూరి అమ్మాయి రామలక్ష్మిగా ప్రేక్షకులు ఆమెను ఒక రేంజ్ లో రిసీవ్ చేసుకున్నారు. ఇక ఆ తరువాత అదే సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా వచ్చింది. అడవి నేపథ్యంలో నడిచే ఈ కథలో గిరిజన యువతి శ్రీవల్లిగా రష్మిక మంచి మార్కులు కొట్టేసింది.
రీసెంట్ గా వచ్చిన 'దసరా' సినిమాలో వెన్నెల అనే డీ గ్లామర్ పాత్రలో కీర్తి సురేశ్ మెప్పించింది. ఇక ఇప్పుడు 'మంగళవారం' అనే సినిమాలో పాయల్ రాజ్ పుత్ కూడా డీ గ్లామర్ రోల్ చేసినట్టుగా, ఈ రోజు వదిలిన పోస్టర్ ను బట్టి తెలుస్తోంది. ఈ కథ 1990లలో నడుస్తుంది. అప్పటి పల్లె పిల్లగానే ఆమె ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా హిట్ కొడుతుందేమో చూడాలి.