విజయమ్మ కోపంలో చేయి విసిరారు... ఆ దెబ్బకు ఈగైనా చస్తుందా?: షర్మిల

  • జైలు నుంచి విడుదలైన షర్మిల
  • విజయమ్మ వ్యవహారం ప్రస్తావన
  • తన తల్లి విజయమ్మ ఆవేశంలో కొట్టిన దెబ్బకు రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం
  • బాంబులు వేసినట్టుగా బిల్డప్ ఇస్తున్నారని విమర్శలు
హైదరాబాదులో నిన్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మాత్రమే కాదు, ఆమె తల్లి వైఎస్ విజయమ్మ కూడా పోలీసులపై దురుసుగా ప్రవర్తించినట్టు వార్తలు వచ్చాయి. ఇవాళ జైలు నుంచి విడుదలైన అనంతరం షర్మిల మాట్లాడుతూ తల్లి విజయమ్మ అంశాన్ని ప్రస్తావించారు. తన తల్లి విజయమ్మ కోపంలో చేయి విసిరారని, ఆ మాత్రానికే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. 

"ఘటన తీవ్రత కారణంగా ఆమె ఓ వేటు (దెబ్బ) వేసిందే అనుకుందాం... కానీ దాన్ని పెద్ద వివాదం చేస్తున్నారు. విజయమ్మ గారు బాంబులు వేసినట్టుగా వారు బిల్డప్ ఇచ్చారు. ఆమె వేటు చూశారా అండీ... ఆ వేటుకు ఈగైనా చస్తుందా! 

ఆమె ఓ సీనియర్ సిటిజెన్. ఓ చిన్న వేటు వేసింది. దీన్ని ఎంత బ్లో అప్ చేస్తున్నారో. అప్పట్లో హరీశ్ రావు ఎలా కొట్టాడో చూశారు కదా... ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. కేటీఆర్... పోలీసు అధికారులను, గవర్నమెంట్ ఆఫీసర్లను బూతులు తిట్టాడు... ఇవేవీ లెక్కలోకి రావా?

ఈ రోజున వాళ్లు దుర్మార్గంగా పరిపాలన చేస్తూ, ఆడవాళ్లు అని కూడా చూడకుండా ఇంత నీచంగా వ్యవహరిస్తున్నారు. వీళ్లని ఏమనాలి? ఇదేనా బంగారు తెలంగాణ?" అంటూ షర్మిల నిప్పులు చెరిగారు.


More Telugu News