ఆయన్ని వ్యతిరేకించలేదు కానీ...: ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసల వర్షం
- మోదీ విజన్ తో పూర్తిగా ఏకీభవిస్తున్నానన్న టీడీపీ అధినేత
- మోదీ విధానాలను వ్యతిరేకించలేదు.. హోదా కోసం మాత్రమే పోరాడానని వ్యాఖ్య
- భారత్ బలాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్న చంద్రబాబు
- ప్రధాని విధానాలను మెరుగుపెడితే అగ్రస్థానంలో భారత్ అన్న బాబు
ప్రధాని నరేంద్ర మోదీపై తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ విజన్ తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. గతంలో తాను మోదీ విధానాలను వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. తాను కేవలం ప్రత్యేక హోదా కోసం మాత్రమే మోదీ మీద పోరాటం చేశానని చెప్పారు. పార్టీలు వేరయినప్పటికీ తాను, మోదీ విజన్ ఉన్న నాయకులం అన్నారు. రూ.500కు పైన ఉన్న పెద్ద నోట్లను కూడా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే దేశంలో అవినీతి నిర్మూల సాధ్యమవుతుందన్నారు. తాను మోదీ ఆలోచనలకు అనుగుణంగా పని చేయడానికి సిద్ధమన్నారు. భారత్ బలంఏమిటో ప్రధాని ప్రపంచానికి చాటి చెబుతున్నారని ప్రశంసించారు.
టైమ్ ఆఫ్ ట్రాన్స్ ఫర్మేషన్: ది నీడ్ టు కీప్ ఫైటింగ్ అంశంపై జరిగిన సదస్సులో ఆయన వర్చువల్ గా పాల్గొని మాట్లాడారు. మోదీ ప్రపంచవ్యాప్తంగా దేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారన్నారు. మోదీ వల్లే ఇవాళ ప్రపంచమంతా భారత్ ను గుర్తిస్తోందన్నారు. ప్రధాని విధానాలను మెరుగుపెడితే 2050 నాటికి భారత్ దే అగ్రస్థానం అన్నారు. పబ్లిక్, ప్రయివేట్, పార్ట్‌నర్‌షిప్ అన్నది కొత్త విధానమని, టెక్నాలజీతో పేదరికాన్ని రూపుమాపవచ్చునని చెప్పారు. ఫిన్ టెక్ దేశంలో కొత్త విప్లవాన్ని తెచ్చిందన్నారు. డిజిటల్ టెక్నాలజీ, డెమోగ్రాఫిక్ డివిడెండ్లు దేశాన్ని నడిపిస్తాయన్నారు.