రామ్ చరణ్ నా ఫ్రెండు... అతడి ద్వారా ఓసారి అఖిల్ ను కలిశాను: డినో మోరియా
- అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్
- నెగెటివ్ రోల్ పోషించిన బాలీవుడ్ నటుడు డినో మోరియా
- ఏజెంట్ కథ వినగానే నచ్చేసిందని వెల్లడి
- అఖిల్ తనను తాను అద్భుతంగా మార్చుకున్నాడని కితాబు
టాలీవుడ్ సినిమాల్లో బాలీవుడ్ నటులు నటించడం కొత్త కాదు. గతంలో బాలీవుడ్ నటుల కోసం మనవాళ్లు ప్రయత్నించాల్సి వచ్చేది. అయితే, ఇటీవల ట్రెండ్ మారిన నేపథ్యంలో, బాలీవుడ్ నటులే తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి చిత్రాలే అందుకు కారణం.
ఇక అసలు విషయానికొస్తే... బాలీవుడ్ నటుడు డినో మోరియా టాలీవుడ్ చిత్రం 'ఏజెంట్' లో ఓ డెడ్లీ రోల్ పోషించారు. అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ స్పై మూవీ ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో, ప్రమోషన్ ఈవెంట్లతో చిత్రబృందం బిజీగా ఉంది.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న డినో మోరియా మాట్లాడుతూ, ఏజెంట్ కథ వినగానే ఎంతో నచ్చిందని వెల్లడించారు. తెలుగులో స్ట్రెయిట్ గా ఎంట్రీ ఇవ్వడానికే ఇంతకుమించిన మంచి సినిమా మరొకటి దొరకదని భావించి, వెంటనే ఓకే చెప్పేశానని తెలిపారు. ఈ సినిమా కథలో తనది ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర అని, ఎందుకు విలన్ గా మారానన్నది ఆసక్తి కలిగిస్తుందని తెలిపారు. ఇందులో తన పాత్ర పేరు గాడ్ అని తెలిపారు.
ఇక హీరో అఖిల్ గురించి కూడా డినో మోరియా మాట్లాడారు. టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ తనకు స్నేహితుడని, అతడి ద్వారా ఓసారి అఖిల్ ను కలవడం జరిగిందని వివరించారు. అప్పటికి చాలా చిన్న కుర్రాడిలా కనిపించాడని, కానీ, ఏజెంట్ షూటింగ్ సమయంలో అఖిల్ ను చూసి విస్మయానికి గురయ్యానని, అప్పట్లో తాను చూసిన అఖిల్, ఈ అఖిల్ ఒకటేనా అనిపించిందని తెలిపారు.
అఖిల్ ఎంత కఠోర శ్రమ చేశాడో ఈ సినిమాతో తెలుస్తుందని డినో మోరియా పేర్కొన్నారు. తన లుక్ మార్చుకోవడం కోసం అతడు చూపించిన అంకిత భావానికి హ్యేట్సాఫ్ చెప్పాల్సిందేనని అన్నారు.