క్రికెట్ బాల్ సైజులో వడగళ్లు పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ
- తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి
- ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మారిన వాతావరణం
- ఓవైపు ఎండలు... మరోవైపు అకాల వర్షాలు
- వడగళ్ల వానలు... పిడుగుల విధ్వంసం
- ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా పరిస్థితులు
తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల వడగళ్ల వానలు పంటలను నాశనం చేస్తుండగా, మరికొన్ని చోట్ల పిడుగులు మనుషుల ప్రాణాలు బలిగొంటున్నాయి. దేశంలోని ఇతర భాగాల్లోనూ ఉపరితల ద్రోణి పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
తాజాగా, కొన్నిచోట్ల క్రికెట్ బంతుల సైజులో వడగళ్లు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కర్ణాటక, కారైక్కాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. 40 నుంచి 50 కిమీ వేగంతో ఈదురుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, కొన్ని చోట్ల వడగళ్లు కూడా పడతాయని వివరించింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.