సన్ రైజర్స్ పై ప్రతీకారం తీర్చుకున్నంత ఆనందంలో డేవిడ్ వార్నర్
- హైదరాబాద్ జట్టుపై 7 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు
- మ్యాచ్ తర్వాత ఆనందం ఆపులేకపోయిన వార్నర్
- అంతెత్తున ఎగిరి గంతులేస్తూ సంబరాలు
డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యంపై తన ప్రతీకారం తీర్చుకున్నాడు. ప్రతీకారం ఏంటి? అనుకుంటున్నారా.. నిజానికి అలా అని కాదు కానీ, తనను కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా, జట్టులో చోటు కూడా లేకుండా అవమానకరంగా బయటకు గెంటేసిన హైదరాబాద్ ఫ్రాంచైజీ పట్ల వార్నర్ గుర్రుగా ఉన్నాడు. తన అసంతృప్తిని లోగడే మీడియా ముఖంగా వెళ్లగక్కాడు కూడా. హైదరాబాద్ వదిలేయడంతో, ఎంతో అనుభవం ఉన్న వార్నర్ ను వేలంలో ఢిల్లీ జట్టు సొంతం చేసుకుంది.
రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ప్రస్తుత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును నడిపించే బాధ్యత వార్నర్ కు లభించింది. ఆస్ట్రేలియా జట్టును సైతం నడిపించిన అనుభవం, బ్యాటర్ గా మంచి ట్రాక్ రికార్డు కలిగిన వార్నర్ ను హైదరాబాద్ జట్టు వదులుకోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, తన పట్ల అగౌరవంగా వ్యవహరించిన హైదరాబాద్ ను ఓడించడం వార్నర్ కు అంతులేని సంతోషాన్నిచ్చిందనే చెప్పుకోవాలి.
సోమవారం హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ సందర్భంగా వార్నర్ హావభావాలను పరిశీలిస్తే అదే అనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో వార్నర్ లో ఆనందం ఉప్పొంగింది. ఆకాశంలో అంతెత్తున జంప్ చేసి విజయానందం పొందడాన్ని వీడియోలో చూడొచ్చు. చివరి ఓవర్ లో ప్రతి బాల్ ను కట్టుదిట్టంగా వేయాలంటూ వార్నర్ డైరెక్షన్ ఇవ్వడం కూడా మ్యాచ్ సందర్భంగా కనిపించింది.