జాక్ పాట్ కొట్టేసిన రహానే.. ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ జట్టులో చోటు 

  • ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కోసం 15 మందితో బృందం
  • జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్ లో జరగనున్న టెస్ట్ మ్యాచ్
  • పుజారా, ఉనద్కత్ తదితరులకు చోటు.. రోహిత్ శర్మ సారథ్యం
ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున బ్యాట్ తో విధ్వంసం సృష్టిస్తున్న అజింక్య రహానే.. బీసీసీఐ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021-23 ఫైనల్ కోసం పంపించే 15 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. ఇందులో అజింక్య రహానేకి చోటు లభించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియాను రోహిత్ శర్మ నడిపించనున్నాడు. జూన్ 7 నుంచి 11 మధ్య లండన్ లోని ఓవల్ మైదానంలో ఇది జరగనుంది. రహానే చివరిగా 2022లో దక్షిణాఫ్రికా పర్యటనలో చోటు సంపాదించాడు. 

ఆర్ రౌండర్ శార్ధూల్ ఠాకూర్ కు సైతం టెస్ట్ స్క్వాడ్ లో చోటు దక్కింది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్, మహమ్మది షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ ఎంపికయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి శుభ్ మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ , వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు సైతం స్థానం దక్కింది. కేఎస్ భరత్ ను మొదటి ప్రాధాన్య వికెట్ కీపర్ గా ఎంపిక చేశారు. చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్ ఎంపికైన వారిలో ఉన్నారు.


More Telugu News