భారత్‌లో వరుసగా మూడో రోజూ కరోనా కేసుల్లో తగ్గుదల

  • గత 24 గంటల్లో కొత్తగా 6,660 కరోనా కేసుల నమోదు
  • మరో 24 మంది మృతి
  • మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 63,380
  • వెల్లడించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
భారత్‌లో వరుసగా మూడో రోజూ కరోనా కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 6,660 కేసులు వెలుగులోకి వచ్చాయి. నిన్న 7,178 కేసులు వెలుగు చూడగా అంతకుముందు రోజున 10,112 కేసులు నమోదయ్యాయి. శనివారం నాడు 12193 కేసులు బయటపడ్డాయి. ఇక సోమవారం నాటి రోజువారీ పాజిటివిటీ రేటు 3.52 శాతం, వారం రోజుల సగటు పాజిటివిటీ 5.42 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా పేర్కొంది. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 63,380 అని వెల్లడించింది. 

కేంద్ర ఆరోగ్యశాఖ తాజా లెక్కల ప్రకారం, గత 24 గంటల్లో 24 మంది కరోనాతో మరణించారు. వీరిలో కేరళకు చెందిన వారే తొమ్మిది మంది ఉన్నారు. దీంతో, దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,31,369కు చేరుకుంది. ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసుల వాటా 0.14 శాతం. రికవరీ రేటు 98.67గా ఉంది.


More Telugu News